Monday, 6 November 2017

అందరికీ సౌకర్యవంతమైనవాట్ట్సప్ "డిలీట్" ఆప్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది


అందరికీ సౌకర్యవంతమైనవాట్ట్సప్ "డిలీట్" ఆప్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడైనా వాట్ట్సప్ లో పొరపాటున ఏదైనా పోస్ట్ చేసి ఉంటే అది  డిలీట్ చేసే అవకాశం ఉండేది కాదు ఒక్కోసారి దీనిమూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసివచ్చేది.కనీఇప్పుడు  ఆండ్రాయిడ,ఐఫోన్ మరియు విండోస్  ఏ  ఫోన్ వాడుతున్నవారైనా  ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.

డెలీట్ చేయడం ఇలా:

మీరు పొరపాటున మీ స్నేహితులకు గ్రూప్ లోలేదా ఇందివిజువల్ గా ఏదైనా మెసేజ్ పంపారు అనుకుందాం.
> ఏదైతే పంపారో ముందు ఆ మెసేజ్ ని సెలెక్ట్ చేయండి
> ఆ తర్వాత పైన ఉన్న డిలీట్ సింబల్ ని క్లిక్ చేయండి
>"Delete For All" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా అందరికి కనబడకుండా డెలీట్ చేయ వచ్చు.
>"Delete for Me" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా మీ ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది.



కానీ కేవలం 7 నిమిషాల లోపల మాత్రమే ఈ అవకాశం మీకు ఉంటుంది తరువాత డిలీట్ ఆప్షన్ ఉండదు జాగ్రత్త.

ఈ వాట్సప్(Wattsup) మెసేజ్ లు చూస్తే నవ్వాపుకోలేరు తెలుసా....Wattsup massages and their funny comments..


















Friday, 3 November 2017

నడుము వెనక భాగంలో ఈ గుంటలు మీకు ఉన్నాయా అయితే ఇది చదవండి





బుగ్గలపై సొట్టలు ఉండటం , కొన్ని శరీరంలో అవయవాలపై పుట్టు మచ్చలు ఉండటం అదృష్టం అని మన పెద్దలు చెబుతుంటారు అలాగే నడుము వెనక భాగంలో పోటోలో చూపినట్టు సొట్టలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే..


ఆ గుంతలవంటి గుర్తులు రోమన్లు అందానికి గుర్తుగా భావించే "వీనస్" దేవత గుర్తులు ఇవి ఉన్నవారు ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. అందానికి ప్రాదాన్యం ఇస్తారు, అంతేకాకుండా ఈ గుర్తులు ఉన్నవారు శృంగారంలో అధిక సుఖాన్ని అందిస్తారట ఎందుకంటే ఆ ప్రదేశంలో గుంటలు ఉండటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి అదిక ఆనందాన్ని పొండుతారట. ఈ రంద్రాలు ఉన్నచోట ఎలాంటి కండరాలు ఉండవు కాబట్టి వ్యాయామం ద్వారా వీటిని పొందలేరట ...

వీటిని మగవారిలో "వీనస్ హోల్స్"  అని ఆడవారిలో "అపోలో హోల్స్" అని పిలుస్తారు  మీరుకూడా చూసుకోండి లేదంటే ఉన్నవారిని  చేసుకోండి.....


Tuesday, 6 September 2016

మీ వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉందో దానిని బట్టి ఏ ఏ కోర్కెలు తీరబోతున్నాయో తెలుసుకొండి ....

ఫ్రతి పనికిముందు వినాయకుడికి పూజించడం మన ఆనవాయితీ కానీ ఈ చవితిలో ప్రతిరోజూ ఆ విగ్నేశ్వరున్ని రకరకాల రూపాలలో పూజించడం మనకు అలవాటే అయితే విగ్నేశ్వరుని తోండం ఆయన తీర్చబోయే కోర్కెలను తెలియజెస్తుందని మీకు తెలుసా...



Left Trunk Ganesh

 

తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో వాస్తు దోశాలు తొలగి, అందరూ ఆయురారోగ్యాలనూ అనుభవిస్తారు అందు వలన మనం ఇళ్ళలో నూ , వాడళ్ళో నూ ఎడమ తోండం వినాయకుడే దర్శనమిస్తాడు..

 

Right Sided Trunk Ganesh



 
తొండం కుడి వైపుకు తిరిగి ఉన్న వినాయకుడు సిద్ది వినాయకుడట. అలా కుడివైపు తొండం వినాయకున్ని పూజిస్తే, మనం అనుకునేది వెంటనే జరిగిపోతుందట. ముంబై లోని సిద్ది వినాయకుడికి తోండం కుడివైపే వుంటంది మరి. అందుకే అక్కడ ఆయనను వర సిద్ది వినాయకుడని పేరు.

Straight Sided Trunk Ganesh


 తొండం నిటారుగా ఉండే వినాయకులు చాలా అరుదు, తొండం నిటరుగా ఉన్న వినాయకున్ని పూజిస్తే అనుకోని విదంగా గొప్ప కార్యాలు నెరవేరుతాయట .

Friday, 26 August 2016

పిల్లాడిని కొట్టకుండా మార్చాడు అద్బుతంగా ఉంది మీరూ చదవండి:
ఒక అబ్బాయి   చీటికీ మాటికీ తల్లితో పోట్లాడటం, చెల్లిని కొట్టడం చేస్తుండేవాడు. తరువాత తండ్రి అతడిని కొట్టేవాడు ఇలా రోజూ వళ్ళ ఇంట్లో జరుగుతూ ఉండేది.
తండ్రికి కొడుకును ఎలాగైనా మార్చాలి అనిపించింది .....
"ఒకరోజు తండ్రి కొడుకుని కొట్టడం మానేసి ఈరోజు నుండి నీకు  కోపం వచ్చినప్పుడల్ల ఒక మేకుని ఆ గోడకు కోట్టు అని ఇంట్లో ఒక గోడని చుపించాడు. ఆరోజునుండి ఆ అబ్బాయి తల్లితో చెల్లితో పోట్లాడాలనుకున్నపుడల్లా  ఒక్కో మేకుని గోడమీద కొట్టేవాడు. అది గట్టి సిమెంటు గోడకావడంతో కొట్టడానికి చాలా కష్టపడేవాడు. నెలరోజులతరువాత మేకు కొట్టడం కన్నా కోపం కంట్రోలు చేసుకోవడమే సులువు అనిపించింది కొద్దిరోజుల తరువాత కోపం తగ్గిపోవడాన్ని గమనించాడు ....ఆవిశయాన్ని తండ్రికి గర్వంగా చెప్పాడు. 
"వెరీగుడ్ ... ఇప్పుడుగోడకున్న  ఒక మేకుని తీసెయ్ అలాగే నీకు కోపం అదుపు చేసుకోవాలనిపించినపుడల్లా ఒక్కో మేకుని తీసెయ్ అన్నడు" తియ్యడం సులువేకదా అని సరేచెప్పాడు  మూడునెలల్లో మొత్తం మేకులు అన్నీ తేసేసి తండ్రికి సంతోషంగా చెప్పాడు.
తండ్రి నవ్వుతూ "వెరీ గుడ్... కానీ ఈ గోడమీద చేసిన రంద్రాలు చూశావా? అవి పూడ్చడం మామూలు విషయం కాదు. నువ్వుకోడా అమ్మ, చెల్లీ మనసులను అలాగే గాయ పరిచావు"? అన్నడు.
చూడు బాబూ ఒకరి మనసు గాయపరచడం సులువు కానీ గాయపడిన మనస్సును తిరిగి ఆకట్టుకోవడం చాలా కష్టం కొన్నిసందర్బాలలో అది అసాద్యం కూడా అని చెప్పాడు. 

అప్పుడు అతడు చేసిన తప్పు అర్థం అయ్యింది తల్లీ, చెల్లికి క్షమించమని చెప్పి8 తన పద్దతిని మార్చుకున్నాడు ....  

Thursday, 25 August 2016

బతికేందుకువచ్చావు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు.

బతికేందుకువచ్చావు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు. 

ఈమద్య పేపర్ చూద్దాం  అంటే భయంవేస్తుంది కారణం ప్రతిరోజూ ఆత్మహత్యల్లంటి వార్తలు అందులోనూ టీనేజ్ పిల్లలు పసిప్రాయంలోనే వారిప్రాణాలను తామే తీసుకోవడం నన్ను భాగా భదించే విశయం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నరు అందులో 1 లక్షా 35 వేలమంది భారతీయులే. 


రాతిరి వెళ్ళనిదే సూర్యుడు రాడుకదా 
గొంగళిపురుగు దశమారితేనే అందమైన శీతాకోక చిలుకగా మారునని తెలియదా
ఉలిదెబ్బలు భరించనిదే శిల శిల్పం కాలేదుకదా  
మరి అత్యుత్తమ మైన మానవజన్మనెత్తిన నీకు పరిక్షపెట్తకుండా ఉంటాదా ఆ భగవంతుడు ఆశ అనేది లేకపోతే అడుగుకూడా ముందుకు జరగలేవు.

నీకు కావలసిందల్లా రేపటి పై ఆశ ఈరోజు నిన్ను నువ్వు కాపాడుకోగలిగే ఆత్మ విశ్వాసం. మనిశిమాటలు వినకు నీకెవరూ తోడులేనప్పుడు నీడనే నీతోడనుకో నీది అయిన రోజున అందరూ నీవెనకాలే రాకతప్పదని తెలుసుకో...

నీకు ఇష్టమైనది ఏదైనా లబించనపుడు 
నీకు లభించినదే ఇష్టమైనదిగా భావించు
లోకిలు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు
కాబట్టి ఇతరులు నిన్ను అనేమాటను మర్చిపో...
ప్రేమంటే హౄదయాన్ని పారేసుకోవడం కాదు 
నువ్వులేనపుడు నవ్వుని నువ్వున్నప్పుడు కాలాన్ని పారేసుకోవడం .
అనుభ్వమే నిన్ను నడిపించే గొప్ప గురువు అని తెలుసుకో 
ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే ఆపదల్లో చిక్కుకుంటావు, ఒంటరిగానే కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు 
ఎన్నో ఇతర బోదనలకంటే భాదనేర్పే పాటం సులువుగా అర్థం అవుతుంది.అదే మనల్ని శక్తివంతులను చేస్తుంది.
జీవించడానికి ప్రయత్నించు, ఆక్షేపించు, అన్వేశించు కానీ చావుకి లొంగిపోకు.

గెలుపు జ్వరంతగిలిన ఈ లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనుశుల్ని  దయతో పరిహసించు.
సమర్థుల్ని ఈతలో కొట్టుకుపోనిచ్చి జీవితంగట్టున ప్రశాంతంగా నిలబడిచూపించు.
బతికేందుకువచ్చవు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు.


దృశ్యం నుండి రహస్యం లోకి
ఉద్వేగాలనుండి స్వచ్చతలోకి 
భయంనుండి స్వేచ్చలోకి 
శ్రమతెలియక నడిచే భాటసారిలా
నీ జీవనయానాన్ని కొనసాగించు 
బతికేందుకువచ్చవు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు.