Friday 26 August 2016

పిల్లాడిని కొట్టకుండా మార్చాడు అద్బుతంగా ఉంది మీరూ చదవండి:
ఒక అబ్బాయి   చీటికీ మాటికీ తల్లితో పోట్లాడటం, చెల్లిని కొట్టడం చేస్తుండేవాడు. తరువాత తండ్రి అతడిని కొట్టేవాడు ఇలా రోజూ వళ్ళ ఇంట్లో జరుగుతూ ఉండేది.
తండ్రికి కొడుకును ఎలాగైనా మార్చాలి అనిపించింది .....
"ఒకరోజు తండ్రి కొడుకుని కొట్టడం మానేసి ఈరోజు నుండి నీకు  కోపం వచ్చినప్పుడల్ల ఒక మేకుని ఆ గోడకు కోట్టు అని ఇంట్లో ఒక గోడని చుపించాడు. ఆరోజునుండి ఆ అబ్బాయి తల్లితో చెల్లితో పోట్లాడాలనుకున్నపుడల్లా  ఒక్కో మేకుని గోడమీద కొట్టేవాడు. అది గట్టి సిమెంటు గోడకావడంతో కొట్టడానికి చాలా కష్టపడేవాడు. నెలరోజులతరువాత మేకు కొట్టడం కన్నా కోపం కంట్రోలు చేసుకోవడమే సులువు అనిపించింది కొద్దిరోజుల తరువాత కోపం తగ్గిపోవడాన్ని గమనించాడు ....ఆవిశయాన్ని తండ్రికి గర్వంగా చెప్పాడు. 
"వెరీగుడ్ ... ఇప్పుడుగోడకున్న  ఒక మేకుని తీసెయ్ అలాగే నీకు కోపం అదుపు చేసుకోవాలనిపించినపుడల్లా ఒక్కో మేకుని తీసెయ్ అన్నడు" తియ్యడం సులువేకదా అని సరేచెప్పాడు  మూడునెలల్లో మొత్తం మేకులు అన్నీ తేసేసి తండ్రికి సంతోషంగా చెప్పాడు.
తండ్రి నవ్వుతూ "వెరీ గుడ్... కానీ ఈ గోడమీద చేసిన రంద్రాలు చూశావా? అవి పూడ్చడం మామూలు విషయం కాదు. నువ్వుకోడా అమ్మ, చెల్లీ మనసులను అలాగే గాయ పరిచావు"? అన్నడు.
చూడు బాబూ ఒకరి మనసు గాయపరచడం సులువు కానీ గాయపడిన మనస్సును తిరిగి ఆకట్టుకోవడం చాలా కష్టం కొన్నిసందర్బాలలో అది అసాద్యం కూడా అని చెప్పాడు. 

అప్పుడు అతడు చేసిన తప్పు అర్థం అయ్యింది తల్లీ, చెల్లికి క్షమించమని చెప్పి8 తన పద్దతిని మార్చుకున్నాడు ....  

Thursday 25 August 2016

బతికేందుకువచ్చావు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు.

బతికేందుకువచ్చావు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు. 

ఈమద్య పేపర్ చూద్దాం  అంటే భయంవేస్తుంది కారణం ప్రతిరోజూ ఆత్మహత్యల్లంటి వార్తలు అందులోనూ టీనేజ్ పిల్లలు పసిప్రాయంలోనే వారిప్రాణాలను తామే తీసుకోవడం నన్ను భాగా భదించే విశయం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నరు అందులో 1 లక్షా 35 వేలమంది భారతీయులే. 


రాతిరి వెళ్ళనిదే సూర్యుడు రాడుకదా 
గొంగళిపురుగు దశమారితేనే అందమైన శీతాకోక చిలుకగా మారునని తెలియదా
ఉలిదెబ్బలు భరించనిదే శిల శిల్పం కాలేదుకదా  
మరి అత్యుత్తమ మైన మానవజన్మనెత్తిన నీకు పరిక్షపెట్తకుండా ఉంటాదా ఆ భగవంతుడు ఆశ అనేది లేకపోతే అడుగుకూడా ముందుకు జరగలేవు.

నీకు కావలసిందల్లా రేపటి పై ఆశ ఈరోజు నిన్ను నువ్వు కాపాడుకోగలిగే ఆత్మ విశ్వాసం. మనిశిమాటలు వినకు నీకెవరూ తోడులేనప్పుడు నీడనే నీతోడనుకో నీది అయిన రోజున అందరూ నీవెనకాలే రాకతప్పదని తెలుసుకో...

నీకు ఇష్టమైనది ఏదైనా లబించనపుడు 
నీకు లభించినదే ఇష్టమైనదిగా భావించు
లోకిలు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు
కాబట్టి ఇతరులు నిన్ను అనేమాటను మర్చిపో...
ప్రేమంటే హౄదయాన్ని పారేసుకోవడం కాదు 
నువ్వులేనపుడు నవ్వుని నువ్వున్నప్పుడు కాలాన్ని పారేసుకోవడం .
అనుభ్వమే నిన్ను నడిపించే గొప్ప గురువు అని తెలుసుకో 
ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే ఆపదల్లో చిక్కుకుంటావు, ఒంటరిగానే కర్మ ఫలితాన్ని అనుభవిస్తావు 
ఎన్నో ఇతర బోదనలకంటే భాదనేర్పే పాటం సులువుగా అర్థం అవుతుంది.అదే మనల్ని శక్తివంతులను చేస్తుంది.
జీవించడానికి ప్రయత్నించు, ఆక్షేపించు, అన్వేశించు కానీ చావుకి లొంగిపోకు.

గెలుపు జ్వరంతగిలిన ఈ లోకంలో పరాజితుడివై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనుశుల్ని  దయతో పరిహసించు.
సమర్థుల్ని ఈతలో కొట్టుకుపోనిచ్చి జీవితంగట్టున ప్రశాంతంగా నిలబడిచూపించు.
బతికేందుకువచ్చవు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు.


దృశ్యం నుండి రహస్యం లోకి
ఉద్వేగాలనుండి స్వచ్చతలోకి 
భయంనుండి స్వేచ్చలోకి 
శ్రమతెలియక నడిచే భాటసారిలా
నీ జీవనయానాన్ని కొనసాగించు 
బతికేందుకువచ్చవు గనుక బలంగా ఒక బతుకు బతికిచూపించు.