Monday 13 June 2016

ఒక మంచిమాట: భాహుబలి 

వందమందిని చంపితే వీరుడంటారు కానీఒక్కరిని కాపాడితే దేవుడంటారు అని ఒక్క దైలాగ్ తో కదమొత్తం మలుపుతిప్పారు రాజమౌలి గారు భహుబలి సినిమాలో ఆ కాన్సెప్టు ఇతిహాసాలనుండి తీసుకోబడింది అనితెలుసా. 

ఇతిహాసం అనగా ఇందులో ఎక్కడా కల్పించబడి చెప్పింది లేదు, ఇది ఇట్లే జరిగింది అని అర్ధం అందుకే రామాయణం, భారత, భాగవతాలను ఇతిహాసాలు అని అంటారు. అందుకే వాటిలోని పాత్రలను పరిచయం చెయ్యడానికి ఒక వ్యక్తి రచించినట్లుగా అవి ఉండవు రాసినవ్యక్తి కూడా అందులో అంతర్భాగం అయీ ఉంటాడు . రామాయణం తీసుకుంటే వాల్మీకి అందులో అంతర్భాగం ఓక వ్యక్తి రాజ్యపాలన చూస్తేనే   అందులోని ప్రజల మనోభావాలను కళ్ళకు కట్టినట్టు స్పస్టంగా తెలుస్తాయి. 
భాగవతం లో వ్యాసుడు అంతర్బాగం అందుకే భాగవతం ఇతిహాసం 

ఇతిహాసాలలో కేవలం జీవుల చరిత్ర ఒక్కటేకాదు ఆ రాజ్య పాలనపాలన చేసినప్పుడు కాని ఒక సంస్తను నిర్వహించినపుడు ఆ పాలన ప్రజలచే కీర్తించబడినప్పుడు వాటికి కారణాలను, ఎవరైనా ఒకరాజు అపకీర్తి పొందితే అతడు ఏ విది విదానాలను అనుసరించడం ద్వరా అపకీర్తి పొదాడు అని తెలుస్తుంది. 
రాముడు రావణాసురుడు ఇద్దరూ రాజ్య పాలన చేసిన వారే కాని రాముడి పాలనలో ప్రజలు సుఖ పడ్డరనీ రావణుడి పాలనలొ ప్రజలు సుఖపడలేదనీ నిర్ణయించాలి అనుకుంటే 24000 శ్లోకాలు కష్టపడి చదివి తప్పులు వెతకవలసి వస్తుంది కానీ ఈ క్రింది ఒక్క శ్లోకం ద్వారా అందులో ఆంతర్యాన్ని తెలుసుకోవచ్చు. 

స్వామిణాం ప్రతికూలేన ప్రజాతీక్షేన రావణా
రక్షమాన నబద్ధంతే  మేషా గోమాయు నాయధా.


పరిపాలించే స్తానం లో ఉన్నవాడు ఒకకుటుంబంలొ ఉన్న ఒక తండ్రి దగ్గరనుండి  రజ్యాన్ని పాలించేరాజు వరకు మొట్టమొదట ఉండవలసిన లక్షణం  ఏమనగా తాను ఎవరి వెనక ఉండి నడిపిస్తున్నాడు వారిని ముందుండి నడిపించుచూ పరిపాలన చేసే టప్పుడు వెనకనుండి కాపడువాడు.

ఉదా: గొర్రెల మందకు తోడేళ్ళ నుండి ఆపద ఉంటుంది కనుక ఆతోడేళ్ల నుండి రక్షించడానికి ఆమంద వెనకాల ఒక నక్క వెలుతుంటే తోడేల్ల నుండి గొర్రెలను కాపాడుట కంటే వాటిని తినేయడం పైనే ఆ నక్క ద్యాస ఉంటుంది.

కాబట్టి ఇతిహాసాలలో ఎన్నో విశయాలు మనం జీవితంలో అలవరుచుకోవలసిన పద్దతులు లక్షణాలను వివరించ బడ్డాయి. 

రామాయణం ద్వార మన జీవితంలో సత్సంబందాలను మెరుగు పరచుకోవచ్చు. అలాగే మహాభారతం  లక్షాలను సాదించడానికి ఆచరించ వలసిన విధివిధానాలను తెలుపుతాయి.

అందుకే రామాయణం లక్షణ గ్రంథం , మహాభారతం లక్ష్య గ్రంథం అని అంటారు. మనం జీవితంలో ఉన్నస్తానంనుండి ఉన్నత స్తానానికి తీసుకెళ్లడాంకి ఇతిహాసాలు ఉపయోగ పడతాయి.
టీవి, ఫ్రిజ్ , మోటర్ బైకు వంటివి కోన్నాక కంపనీ వాడు ఇచ్చిన మ్యానువల్ చదవడం ఎంత అవసరమో ఈ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడు బగవద్గీత అనే మ్యనువల్ ఇచ్చాడు కాబట్టి జీవితం అంతా పోయాక దాని చడవడం అంటే టివి పేలిపొయాక  మ్యనువల్ చదవడం అన్నట్టు.

Friday 10 June 2016

త్వరపడండి మీకూ అవకశం ఉంది స్వర్గం కావాలా నరకం కావాలా...
=*=*=*=*=*=*=*=*=*=*==*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*
మానవ జన్మలో ఆఖరి మజిలీ చావు అలాగే అనగా అనగా ఒక వ్యక్తి తాను మరణించిన తర్వాత యమలోకంలో అడుగు పెట్టాడు. అతడిని యమ సబలో ప్రవేశపెట్టాక చిత్రగుప్తుడు అతడి పాపాలను పుణ్యాలను లెక్కగడితే సరిగ్గ సగం పుణ్యాలూ / సగం పాపాలూ వచ్చాయి.
అప్పుడు యమధర్మ రాజు అతడికి ఒక అవకాశం ఇచ్చడు నువ్వు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా నువ్వే ఎంచుకోమ్మని చెప్పాడు. అప్పుడు ఆ మానవుడు యమధర్మ రాజా నాకు స్వర్గం ఎలావుంటుందో నరకం ఎలావుంటుందో తెలియదు కదా! మీ యమ లోకంలో స్వర్గం మరియు నరకాలకు సంబందించిన అడ్వర్టైసింగ్ లాంటివి ఏమైనా ఉంతే చూపించండి అని అడిగాడు

అప్పుడు యమధర్మ రాజు స్వర్గానికి సంబందించిన అడ్వర్టైసింగ్  చూపించాడు .


 ఆ అడ్వర్టైసింగ్ లో చాగంటిగారి ప్రవచనాలు, యోగసనాలు, కొబ్బరిబొండాలు, మొలకలు మరియు ఫ్రూట్ సలాడ్ లు కనిపించాయి మనోడు అవాక్కయాడు స్వర్గం ఇలావుందేంటి ఒకసారి నరకం కూడా చెక్ చేద్దాం అనుకున్నాడు.

యముడిని నరకం ఎలావుంటుందో చూపించమని అడిగాడు.
అప్పుడు యమ ధర్మరాజు ఇలా చూపించాడు .....  
 

మనోడికి కళ్ళు చెదిరి పోయాయ్ పిచ్చి వాళ్ళు భూలోకం లో మనవాళ్ళంతా స్వర్గాన్ని నరకంగా  నరకాన్ని స్వర్గంగా ఊహించుకుంటున్నారు  అని యమధర్మరాజా నేను నరకానికే వెల్తాను అన్నాడు.
యమధర్మరాజు మళ్ళీ ఆలో చించుకో ఒకసారి పంపితే మళ్ళీ తిరిగిరావడం కుదరదు అన్నాడు.
నేను అడ్వర్టైసింగ్ చూసానుకదా నాకు నరకమే కావాలి అని నరకానికి వెళ్ళాడు .
లోపలికి వెళ్లేసరికి అందరిని నూనెలో కాల్చడం ముళ్ళతో గిచ్చడం వంటివి చూసి అదేంటి నాకు చూపించినవి  వేరు కదా అన్నడు.
అప్పుడు యమధర్మ రాజు మా అడ్వర్టైసింగులు  అలాగే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అంటాడు.

చాలా మంది ఇలాగే  డైలీలైఫ్ లో అడ్వర్టైసింగులు సినిమాలు చూసి చూసి,అదొక ఫ్యాషన్ అనుకొని  జంక్ ఫుడ్ , మద్యపానం, స్మోకింగ్ వెస్టర్న్ కల్చర్ కి అలవాటుపడి  ముప్పై ఏళ్ళు నిండకుండానే అరవై ఏళ్ళు పడ్డక రావలసిన వ్యాదులన్నీ తెచ్చుకుని జీవితన్ని పాడు చేసుకుంటున్నారు.
కాబట్టి  జీవితంలో పైకి రావడంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం అంతేముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండాలిమరి.  

Wednesday 8 June 2016

జ్యోతి ప్రజ్వళన పరమార్థం.
===================================

ఏదైనా కార్యక్రమాన్ని ప్రాఏంబించేముందు జ్యోతి ప్రజ్వలన చేస్తారు ఆదీపం వెలగాలంటే కావలసినవి దివ్వె, 
వొత్తులు , నూనె అగ్గిపుల్ల తోపాటు కనబడని ఆక్సిజన్ కూడా కావాలి.

అలాగే తలపెట్టిన కర్యానికి కార్యసిద్ది కలిగి సంకల్పం నెరవేరాలంటే మన భౌతికమైన శరీరం మరియు మనలోని జ్ఞానం తో పాటుగా మన మనసు కూడా కార్య నిర్వహనలో నిమగ్నమైనపుడు మాత్రమే విజయం సాదించగలుగుతాము. 

గౌతమ బుద్దుడు తాను ఈలోకాన్ని విడిచివెల్లే తరుణంలో తన శిశ్యులు రోదించడం గమనించి తన ఫ్రియ శిస్యుడైన "ఆనన్" ని పిలిచి ఎందుకు దుఖి:స్తున్నారని  అడిగారు.

"ఆనన్" దుఖి:స్తూ  ఈలోకానికి జ్ఞాన కాంతిని పంచిన దీపం అస్తమించబోతుంది ఇక ఈ ప్రపంచం మళ్ళీ అందకారం లోకి వెళ్ళవలసిందే కదా అని బుద్దుడితో తన భాదను చెప్పాడు

అప్పుడు ఆ గౌతమ బుద్దుడు తన ఆకరి మాటగా " LITE UNTO YOUR SELF" అని సమదానం ఇచ్చి తన భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళారు. 

బుద్దుడి మాటల ఆంతర్యం ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూడకుండా ఎవరికి వారే తమ కార్య నిర్వహణ సామర్థ్యాన్ని వాడుకోని తమజీవితంలో దారిని చూపే సంకల్ప కాంతిని వెలిగించుకొమ్మని . 

ALL THE BEST TO YOUR BRIGHT FUTURE MY DEAR FRIENDS.

Wednesday 1 June 2016

సలాం కొట్టించుకునేలా నువ్వు ఎదగాలి అదే నా అభిలాష


వీది వీది తిరుగుతూ కోతులను ఆడెంచేవాళ్ళని చూసుంటారు. ఆడించేవాడు కోతులను హింసిస్తూ వచ్చేవారందరికి సలాం కొట్టిస్తాడు. అయ్యోపాపం అని మనం అనుకుంటాం కానీ ఆ కోతి స్వయం తప్పిదం తో ఇరుక్కుందని మీకు తెలుసా ..

చెట్టు పైనిన్న కోతులను క్రిందకు దింపడనికి వేటగాడు ఒక కూజా (మూతిభగం చిన్నగా ఉండే కండ) ను అరటిపళ్ళు పుట్నాలతో నింపి చెట్టుకింద పెట్టి దూరంగానిలబడి చూస్తూ ఉంటాడు. పుట్నలు మరియు అరటిపళ్ళు అంటే కోతికి ప్రాణం కాబట్టి వాటికోసం కిందకిదిగి అరటిపళ్ళను బయటకి లాగటానికి ప్రయత్నిస్తుంది కాని అరటిపళ్ళు కూజా మూతి చిన్నగా ఉండటం వలన చేయి అందులో ఇరుక్కోని పోతుంది కోతి చాల తెలివైనది అరటిపళ్ళు విడిస్తే చేయి బయటకి వస్తుంది తాను వెళ్లిపోవచ్చు అనితెలుసు కాని వటిమీద మమకారం దానిని వెళ్ళనివ్వదు అరటిపళ్ళను బయటికి లాగడనికి ప్రయత్నిసూనే ఉంటుంది.
అప్పుడు సమయంచూసి వేటగాడు కోతిని బందిస్తాడు సదారణంగా అయితే కోతులు వేటగాడికి దొరకవు ఎందుకంటే అవి ఎంత దూరం అయినా దూకగలవు ఎంత చెట్టునైనా ఎక్క గలవు కాని అరటిపళ్ళ మీద పుట్నాలమీద వ్యామోహం తో అవి వేటగాడికి బందీలుగా మారతాయి. హింసింప బడుతూ ఆడించే వాడు ఎవ్వరికి సలాం కొట్టమన్నా కొడతాయి ఆడతాయి తమ స్వేచ్చను కోల్పోతాయి .

అలాగే మనిషి కూడా చాలా తెలివైన వాడు కాని ఇంటెర్నెట్ లో కాసేపు చాటింగ్  , వాట్సప్, మరియు ఒవర్ టైం నిద్ర, అనే ట్రాప్ లలో చిక్కుకున్నాడు  అనుకుంటాడు పనులను వాయిదా వేయడం వలన పరీక్షలు దగ్గరపడి చదవడం కష్టతరమై భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుంది. 

చెడు అలవాట్లు మానుకొని మంచి అలవాట్లు అలవర్చుకున్నపుడు మాత్రమే విజయం మిమ్మల్ని వరిస్తుంది సాకులు చెప్పడం మానుకొండి మీ జీవితానికి మీరే నిజమైన జవాబు దారి ఒక్కసారి నీ మనసును అడిగి చూడు చేసే పని తప్ప ఒప్ప అని ఎందుకంటే ఈ సమాజాని

కి విజేతలు మాత్రమే కావాలి. సాకులు చెప్పే వారుకాదు. 

ఎవడికి కావాలొయ్ ఊడిపోయిన వాడి సంజాయిషీ 
వాలుకు కొట్టుకొనిపోయిన వాడికి జలం సమాది కడుతుంది 
ధైర్యంతో ఒడ్డుకు చేరిన వాడికి జనం వంగిసలాం కొడుతుంది

సలాం కొట్టించుకునేలా నువ్వు ఎదగాలి అదే నా అభిలాష .