Wednesday 1 June 2016

సలాం కొట్టించుకునేలా నువ్వు ఎదగాలి అదే నా అభిలాష


వీది వీది తిరుగుతూ కోతులను ఆడెంచేవాళ్ళని చూసుంటారు. ఆడించేవాడు కోతులను హింసిస్తూ వచ్చేవారందరికి సలాం కొట్టిస్తాడు. అయ్యోపాపం అని మనం అనుకుంటాం కానీ ఆ కోతి స్వయం తప్పిదం తో ఇరుక్కుందని మీకు తెలుసా ..

చెట్టు పైనిన్న కోతులను క్రిందకు దింపడనికి వేటగాడు ఒక కూజా (మూతిభగం చిన్నగా ఉండే కండ) ను అరటిపళ్ళు పుట్నాలతో నింపి చెట్టుకింద పెట్టి దూరంగానిలబడి చూస్తూ ఉంటాడు. పుట్నలు మరియు అరటిపళ్ళు అంటే కోతికి ప్రాణం కాబట్టి వాటికోసం కిందకిదిగి అరటిపళ్ళను బయటకి లాగటానికి ప్రయత్నిస్తుంది కాని అరటిపళ్ళు కూజా మూతి చిన్నగా ఉండటం వలన చేయి అందులో ఇరుక్కోని పోతుంది కోతి చాల తెలివైనది అరటిపళ్ళు విడిస్తే చేయి బయటకి వస్తుంది తాను వెళ్లిపోవచ్చు అనితెలుసు కాని వటిమీద మమకారం దానిని వెళ్ళనివ్వదు అరటిపళ్ళను బయటికి లాగడనికి ప్రయత్నిసూనే ఉంటుంది.
అప్పుడు సమయంచూసి వేటగాడు కోతిని బందిస్తాడు సదారణంగా అయితే కోతులు వేటగాడికి దొరకవు ఎందుకంటే అవి ఎంత దూరం అయినా దూకగలవు ఎంత చెట్టునైనా ఎక్క గలవు కాని అరటిపళ్ళ మీద పుట్నాలమీద వ్యామోహం తో అవి వేటగాడికి బందీలుగా మారతాయి. హింసింప బడుతూ ఆడించే వాడు ఎవ్వరికి సలాం కొట్టమన్నా కొడతాయి ఆడతాయి తమ స్వేచ్చను కోల్పోతాయి .

అలాగే మనిషి కూడా చాలా తెలివైన వాడు కాని ఇంటెర్నెట్ లో కాసేపు చాటింగ్  , వాట్సప్, మరియు ఒవర్ టైం నిద్ర, అనే ట్రాప్ లలో చిక్కుకున్నాడు  అనుకుంటాడు పనులను వాయిదా వేయడం వలన పరీక్షలు దగ్గరపడి చదవడం కష్టతరమై భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుంది. 

చెడు అలవాట్లు మానుకొని మంచి అలవాట్లు అలవర్చుకున్నపుడు మాత్రమే విజయం మిమ్మల్ని వరిస్తుంది సాకులు చెప్పడం మానుకొండి మీ జీవితానికి మీరే నిజమైన జవాబు దారి ఒక్కసారి నీ మనసును అడిగి చూడు చేసే పని తప్ప ఒప్ప అని ఎందుకంటే ఈ సమాజాని

కి విజేతలు మాత్రమే కావాలి. సాకులు చెప్పే వారుకాదు. 

ఎవడికి కావాలొయ్ ఊడిపోయిన వాడి సంజాయిషీ 
వాలుకు కొట్టుకొనిపోయిన వాడికి జలం సమాది కడుతుంది 
ధైర్యంతో ఒడ్డుకు చేరిన వాడికి జనం వంగిసలాం కొడుతుంది

సలాం కొట్టించుకునేలా నువ్వు ఎదగాలి అదే నా అభిలాష .

No comments:

Post a Comment