Monday 13 June 2016

ఒక మంచిమాట: భాహుబలి 

వందమందిని చంపితే వీరుడంటారు కానీఒక్కరిని కాపాడితే దేవుడంటారు అని ఒక్క దైలాగ్ తో కదమొత్తం మలుపుతిప్పారు రాజమౌలి గారు భహుబలి సినిమాలో ఆ కాన్సెప్టు ఇతిహాసాలనుండి తీసుకోబడింది అనితెలుసా. 

ఇతిహాసం అనగా ఇందులో ఎక్కడా కల్పించబడి చెప్పింది లేదు, ఇది ఇట్లే జరిగింది అని అర్ధం అందుకే రామాయణం, భారత, భాగవతాలను ఇతిహాసాలు అని అంటారు. అందుకే వాటిలోని పాత్రలను పరిచయం చెయ్యడానికి ఒక వ్యక్తి రచించినట్లుగా అవి ఉండవు రాసినవ్యక్తి కూడా అందులో అంతర్భాగం అయీ ఉంటాడు . రామాయణం తీసుకుంటే వాల్మీకి అందులో అంతర్భాగం ఓక వ్యక్తి రాజ్యపాలన చూస్తేనే   అందులోని ప్రజల మనోభావాలను కళ్ళకు కట్టినట్టు స్పస్టంగా తెలుస్తాయి. 
భాగవతం లో వ్యాసుడు అంతర్బాగం అందుకే భాగవతం ఇతిహాసం 

ఇతిహాసాలలో కేవలం జీవుల చరిత్ర ఒక్కటేకాదు ఆ రాజ్య పాలనపాలన చేసినప్పుడు కాని ఒక సంస్తను నిర్వహించినపుడు ఆ పాలన ప్రజలచే కీర్తించబడినప్పుడు వాటికి కారణాలను, ఎవరైనా ఒకరాజు అపకీర్తి పొందితే అతడు ఏ విది విదానాలను అనుసరించడం ద్వరా అపకీర్తి పొదాడు అని తెలుస్తుంది. 
రాముడు రావణాసురుడు ఇద్దరూ రాజ్య పాలన చేసిన వారే కాని రాముడి పాలనలో ప్రజలు సుఖ పడ్డరనీ రావణుడి పాలనలొ ప్రజలు సుఖపడలేదనీ నిర్ణయించాలి అనుకుంటే 24000 శ్లోకాలు కష్టపడి చదివి తప్పులు వెతకవలసి వస్తుంది కానీ ఈ క్రింది ఒక్క శ్లోకం ద్వారా అందులో ఆంతర్యాన్ని తెలుసుకోవచ్చు. 

స్వామిణాం ప్రతికూలేన ప్రజాతీక్షేన రావణా
రక్షమాన నబద్ధంతే  మేషా గోమాయు నాయధా.


పరిపాలించే స్తానం లో ఉన్నవాడు ఒకకుటుంబంలొ ఉన్న ఒక తండ్రి దగ్గరనుండి  రజ్యాన్ని పాలించేరాజు వరకు మొట్టమొదట ఉండవలసిన లక్షణం  ఏమనగా తాను ఎవరి వెనక ఉండి నడిపిస్తున్నాడు వారిని ముందుండి నడిపించుచూ పరిపాలన చేసే టప్పుడు వెనకనుండి కాపడువాడు.

ఉదా: గొర్రెల మందకు తోడేళ్ళ నుండి ఆపద ఉంటుంది కనుక ఆతోడేళ్ల నుండి రక్షించడానికి ఆమంద వెనకాల ఒక నక్క వెలుతుంటే తోడేల్ల నుండి గొర్రెలను కాపాడుట కంటే వాటిని తినేయడం పైనే ఆ నక్క ద్యాస ఉంటుంది.

కాబట్టి ఇతిహాసాలలో ఎన్నో విశయాలు మనం జీవితంలో అలవరుచుకోవలసిన పద్దతులు లక్షణాలను వివరించ బడ్డాయి. 

రామాయణం ద్వార మన జీవితంలో సత్సంబందాలను మెరుగు పరచుకోవచ్చు. అలాగే మహాభారతం  లక్షాలను సాదించడానికి ఆచరించ వలసిన విధివిధానాలను తెలుపుతాయి.

అందుకే రామాయణం లక్షణ గ్రంథం , మహాభారతం లక్ష్య గ్రంథం అని అంటారు. మనం జీవితంలో ఉన్నస్తానంనుండి ఉన్నత స్తానానికి తీసుకెళ్లడాంకి ఇతిహాసాలు ఉపయోగ పడతాయి.
టీవి, ఫ్రిజ్ , మోటర్ బైకు వంటివి కోన్నాక కంపనీ వాడు ఇచ్చిన మ్యానువల్ చదవడం ఎంత అవసరమో ఈ జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడు బగవద్గీత అనే మ్యనువల్ ఇచ్చాడు కాబట్టి జీవితం అంతా పోయాక దాని చడవడం అంటే టివి పేలిపొయాక  మ్యనువల్ చదవడం అన్నట్టు.

No comments:

Post a Comment