Monday 30 May 2016

ఆంజనేయ స్వామి వారి సందేశము.

ఆంజనేయ స్వామివారు విద్యను నేర్చుకోవలి అనుకున్నపుడు సూర్యున్ని ఆశ్రయించారు, అప్పుడు సూర్యుడు తాను ఒక్కదగ్గరేఉండి బోదించడం సద్యపడదు అని చెప్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి సూర్యున్ని అనుసరిస్తూ ఆయన వెంట పయనిస్తూ విద్యాబ్యాసాన్ని కొనసాగించాడు అందులోనూ శిశ్యుడు గురువు వెనుకభగాన్ని చూడడం తప్పు గనుక సూర్యునికి అభిముఖంగా పయనిస్తూ సూర్యుని వేడిని భరిస్తూ వేదాలను అభ్యసించాడు కనుకనే ఆ శ్రీరామున్ని ఒక్క దర్శనం లోనే ప్రసన్నం చేసుకో గలిగాడు అద్బుతమైన కర్యాలను సైతం అవలీలగా సదించ గలిగాడు. 

నేర్చుకోవాలనే తపన శిశ్యుడి మనసులో ఉన్నపుడు నేర్చుకునే క్రమంలో ఎన్నిసమస్యలు వచ్చినా వాటిని అధికమించి లక్షాలను సదించగరని అంజనేయ స్వామిజీవితం ద్వార మనకు లక్షణ గ్రంధం అయిన రామాయణం తెలియ జేస్తుంది.
To Raed More:
https://draft.blogger.com/blogger.g?blogID=2238974918661847399#editor/target=post;postID=473745252721847086

Image result for anjaneya swamy with sun

Friday 27 May 2016

స్టార్ లాగా జీవించండి 
దివినుంచేం దిగిరాలేదు మన తారాగణ మంతా
ఇటునుంచే అటువెళ్ళారు మన హీరోలంతా
మీలోనూ ఉండుంటారు కెబోయే ఘనులంతా
పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా


బస్ కండక్టరు గా పనిచేసి బాద్షా లాగా ఎదిగినా ..
పదవ తరగతి ఫెయిలు అయిన కుర్రడి జీవితం పదవ తరగతి బుక్కులో చేర్చినా 
అది వారి కష్టానికి అందిన ఫలమే...

=========================================

14 సంవత్సరాల కుర్రడు పడవ ఎక్కడానికి ఆరుపైసలు డబ్బుల్లేక పైజామ ప్యంటు విప్పుకొని తలపై పెట్టుకొని గంగానది దాటివెళ్ళి చదువుకున్నడు.
40 సంవత్సరాలు గడిచాక భారతదేశానికి మూడవ ఫ్రధనిగా ఎన్నికయ్యాడు .
లాల్ బహద్దూర్ శాస్త్రి .
=================================
ఇల్లు గడవడానికి  కష్టంగా ఉన్న కుటుంబం లో పుట్టి పేపర్ వేస్తూ చదువుకున్నాడు, బి.టెక్ చదవడానికి డబ్బుల్లేక తనసోదరి తాలిబొట్టు ఇస్తే దానిని అమ్ముకుని బి.టెక్ పూర్తిచేసాడు 
50 ఏండ్లు గడిచాక భారత రాష్ట్రపతి అయ్యడు 
A. P.J అబ్దుల్ కలాం  

కలలు కనండి సాకారం చేసుకొండి .

Dare to Dream and Care To Achieve.




Thursday 26 May 2016

మన సంస్కృతిలోనే వుంది పాజిటివ్ తింకింగ్




అసలు సిసలైన సంస్కృతి సాంప్రదాయాలను వదిలి ఇప్పుడు పాజిటివ్ తింకింగ్ కావాలీ అని వెతికి చస్తున్నారు అసలు మన సంస్కృతి లోనే పాజిటివ్ తింకింగ్ ఉందని మీకు తెలుసా....

ఇంట్లో బియ్యం సరుకులు లేకపోతే సరుకులు నిండికున్నయి అనేవారే తప్ప అయిపోయినయి అని అనరు

దీపం కొండెక్కింది అంటారే తప్ప ఆరిపోయింది అని అనరు.

తాళి పెరిగిపోయింది అంటారేతప్ప తెగిపోయింది అనరు

కాబట్టి మనం జీవితాన్ని సరిన మార్గం లో పెట్టే సంస్కృతి ని వదిలి పాచ్చత్వ సంస్కౄతి లో పడిపోయాం కాబట్టే మనకు పాజిటివ్ తింకింగ్ అలవడలేదు.