Friday 26 August 2016

పిల్లాడిని కొట్టకుండా మార్చాడు అద్బుతంగా ఉంది మీరూ చదవండి:
ఒక అబ్బాయి   చీటికీ మాటికీ తల్లితో పోట్లాడటం, చెల్లిని కొట్టడం చేస్తుండేవాడు. తరువాత తండ్రి అతడిని కొట్టేవాడు ఇలా రోజూ వళ్ళ ఇంట్లో జరుగుతూ ఉండేది.
తండ్రికి కొడుకును ఎలాగైనా మార్చాలి అనిపించింది .....
"ఒకరోజు తండ్రి కొడుకుని కొట్టడం మానేసి ఈరోజు నుండి నీకు  కోపం వచ్చినప్పుడల్ల ఒక మేకుని ఆ గోడకు కోట్టు అని ఇంట్లో ఒక గోడని చుపించాడు. ఆరోజునుండి ఆ అబ్బాయి తల్లితో చెల్లితో పోట్లాడాలనుకున్నపుడల్లా  ఒక్కో మేకుని గోడమీద కొట్టేవాడు. అది గట్టి సిమెంటు గోడకావడంతో కొట్టడానికి చాలా కష్టపడేవాడు. నెలరోజులతరువాత మేకు కొట్టడం కన్నా కోపం కంట్రోలు చేసుకోవడమే సులువు అనిపించింది కొద్దిరోజుల తరువాత కోపం తగ్గిపోవడాన్ని గమనించాడు ....ఆవిశయాన్ని తండ్రికి గర్వంగా చెప్పాడు. 
"వెరీగుడ్ ... ఇప్పుడుగోడకున్న  ఒక మేకుని తీసెయ్ అలాగే నీకు కోపం అదుపు చేసుకోవాలనిపించినపుడల్లా ఒక్కో మేకుని తీసెయ్ అన్నడు" తియ్యడం సులువేకదా అని సరేచెప్పాడు  మూడునెలల్లో మొత్తం మేకులు అన్నీ తేసేసి తండ్రికి సంతోషంగా చెప్పాడు.
తండ్రి నవ్వుతూ "వెరీ గుడ్... కానీ ఈ గోడమీద చేసిన రంద్రాలు చూశావా? అవి పూడ్చడం మామూలు విషయం కాదు. నువ్వుకోడా అమ్మ, చెల్లీ మనసులను అలాగే గాయ పరిచావు"? అన్నడు.
చూడు బాబూ ఒకరి మనసు గాయపరచడం సులువు కానీ గాయపడిన మనస్సును తిరిగి ఆకట్టుకోవడం చాలా కష్టం కొన్నిసందర్బాలలో అది అసాద్యం కూడా అని చెప్పాడు. 

అప్పుడు అతడు చేసిన తప్పు అర్థం అయ్యింది తల్లీ, చెల్లికి క్షమించమని చెప్పి8 తన పద్దతిని మార్చుకున్నాడు ....  

No comments:

Post a Comment